సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో(Sangareddy) విషాదం చోటు చేసుకుంది. మంజీరా నదిలో(Manjira river) దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మనూరు మండలం రాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయిపల్లి గ్రామానికి చెందిన మున్నూరు నర్సింలు కుమారుడు రమేష్(26)బుధవారం మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమేదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, రమేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
TGPSC | గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. ఈ నెల 14 నుంచి అందుబాటులోకి మెయిన్స్ హాల్ టికెట్స్
KTR | బతుకమ్మ, దసరా వేళ.. భయానక వాతవరణం సృష్టించారు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఆగ్రహం
TG Rains | తెలంగాణలో మూడురోజులు ఉరుములతో కూడిన వానలు.. హెచ్చరించిన ఐఎండీ