Kanpur Test : అయ్యో.. రెండు రోజులు అసలు బంతే పడలేదు? రెండో టెస్టు డ్రా అవుతుందిపో! అనే బాధలో ఉన్న అభిమానులకు భారత జట్టు (Team India) అసలైన క్రికెట్ మాజాను చూపింది. ఇంత దూకుడుగా ఆడుతున్నది భారత జట్టేనా? అని అందరికీ ఆశ్చర్యం కలిగేలా సాగింది తొలి ఇన్నింగ్స్. కాన్పూర్‌లో ఇంగ్లండ్ బజ్‌బాల్(BuzzBall)ను తలదన్నే విధ్వంసంతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఫలితం తేలాలంటే అద్భుతం చేయాల్సిన దశలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)లు వ్యూహం మార్చారు.
అంతే.. టీమిండియా ఆట అదిరిపోయింది. స్కోర్‌బోర్డు రాకెట్ వేగంతో పరుగులు తీయగా.. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటోకు దిమ్మతిరిగిపోయింది. నాలుగో రోజు క్రీజులోకి రావడమే ఆలస్యం ఓపెనర్ యశస్వీ జైస్వాల్(72 : 51 బంతుల్లో12 ఫోర్లు, 2 సిక్సర్లు) అటాకింగ్ గేమ్ మొదలైంది. ఈ యంగ్‌స్టర్ తన సునామీ ఇన్నింగ్స్‌తో బంగ్లాదేశ్ బౌలర్లను బెంబేలిత్తించాడు. టీ20 తరహాలో చెలరేగి కేఎల్ రాహుల్ (68 : 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) స్ట్రోక్ ప్లేతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో.. టెస్టు క్రికెట్ చరిత్రలో పలు రికార్డులు బద్ధలయ్యాయి. అవేంటంటే..?
Team India 🇮🇳 has become the fastest team to score 50, 100, 150, 200 and 250 runs in the 147 years old history of test cricket 🤯
India is on the way for something historical and memorable 👏🏻
👉🏻 Image Credit – @Sport360#INDvsBAN #INDvBAN#INDvsBANTEST #Ashwin pic.twitter.com/FcxApJqhkE
— Richard Kettleborough (@RichKettle07) September 30, 2024
కాన్పూర్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ ఆసాంతం మెరుపు వేగంతో సాగిపోయింది. యశస్వీ, రోహిత్‌ల విధ్వసంతో 2.6 ఓవర్లకే భారత్ స్కోర్ 50 దాటింది. హిట్‌మ్యాన్ ఔటయ్యాక వచ్చిన శుభ్‌మన్ గిల్(39), యశస్వీకి పోటీగా దంచాడు. దాంతో, టీమిండియా స్కోర్ 10.1 ఓవర్‌కే 100 దాటింది. అనంతరం కేఎల్ రాహుల్(68), విరాట్ కోహ్లీ(47)ల దూకుడుతో 18.2 ఓవర్లకు 150.. 24.2 ఓవర్లకు 200లు చేరింది. టెస్టు క్రికెట్లో టీమిండియా ఇంత వేగంగా రన్స్ చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు నమ్మశక్యంకాని రీతితో 8.22 స్కోరింగ్ రేటుతో భారత ఇన్నింగ్స్ సాగడం పట్ల క్రికెట్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
Yashasvi Jaiswal – 72(51)
KL Rahul – 68(43)
Virat Kohli – 47(34)
Shubman Gill – 39(36)
Rohit Sharma – 23(11)
Akash Deep – 12(5)India scored 285/9 in just 34.4 overs at run-rate of 8.22 !🤯🇮🇳
Dream for BazBall is the reality for Indian Batsmen !!!😎🔥🔥#INDvsBAN #KanpurTest pic.twitter.com/n1pVbHCtDj
— 🇮🇳Tanmay Kulkarni🇮🇳 (@Tanmaycoolkarni) September 30, 2024
తొలి ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు బాదిన టీమిండియా మరో రికార్డు సొంతం చేసుకుంది. ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్లు(Most Sixes) కొట్టిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది భారత జట్టు ఇప్పటికే 96 సిక్సర్లు బాదింది. దాంతో, 2022లో ఇంగ్లండ్ పేరిట ఉన్న 89 సిక్సర్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 2021లోనూ టీమిండియా 81 సిక్సర్లతో చరిత్ర సృష్టంచింది.
టెస్టుల్లో 30వ సెంచరీకోసం నిరీక్షిస్తున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) ఉన్నంత సేపు ధనాధన్ ఆడాడు. హాఫ్ సెంచరీ చేజార్చుకున్నప్పటికీ కెరీర్లో మరో మైలురాయికి చేరాడు. అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (594)లో భారత రన్ మెషీన్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా సచిన్ టెండూల్కర్, కుమర సంగక్కర, రికీ పాంటింగ్‌ల తర్వాత అత్యధిక రన్స్ చేసిన నాలుగో ఆటగాడిగా విరాట్ చరిత్రకెక్కాడు.
👑🇮🇳 This is King Kohli’s era and we are just living in it!
📷 Getty • #ViratKohli #INDvBAN #INDvsBAN #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/5mW3LkFylh
— The Bharat Army (@thebharatarmy) September 30, 2024
తొలి ఇన్నింగ్స్‌లో ఖలెద్ అహ్మద్ వికెట్ తీసిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అరుదైన క్లబ్లో అడుగుపెట్టాడు. 74వ టెస్టులోనే అతడు 300 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో 3 వేలకు పైగా పరుగులు, 300 వికెట్లు చేసిన 11వ ఆటగాడిగా జడ్డూ రికార్డు సాధించాడు. జడేజా కంటే ముందు భారత బౌలర్లు కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్‌లు ఈ ఘనతకు చేరువయ్యారు.
JADEJA – THE GOAT ALL ROUNDER IN TESTS. 🐐
– 2nd Fastest in Test history to complete 3000 runs & 300 wickets. pic.twitter.com/UWoEBa7nh4
— Johns. (@CricCrazyJohns) September 30, 2024