నల్గొండ : నల్గొండ జిల్లాలో అవినీతికి పాల్పడ్డ పశు వైద్యాధికారిని ఏసీబీ అధికారులు ( ACB Raids) రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. జిల్లాలోని చింతపల్లిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌గా(Health Valuation Certificate) పనిచేస్తున్న డాక్టర్ పాల్ జోసెఫ్ గౌతం సోమవారం రూ. 6 వేల లంచం తీసుకుంటుండడగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
మండలానికి చెందిన ఇద్దరు పశు యజమానులు తమ పశువులకు హెల్త్ వాల్యూయేషన్ సర్టిఫికేట్ కోసం చింతపల్లి వైద్యుడిని సంప్రదించారు. సదరు వైద్యుడు డబ్బులు డిమాండ్ చేయడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం ఉదయం కార్యాలయంలో అసిస్టెంట్ సర్జన్ లంచం తీసుకుంటుండడగా పట్టుకున్నారు. వైద్యుడిని అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టు(ACB Court) లో ప్రవేశపెట్టామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే 1064 అనే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫొన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.