– ఇల్లెందు మున్సిపాలిటీలో పనిచేస్తూ చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్
ఇల్లెందు, మే 30 : ఇల్లెందు మున్సిపాలిటీలో పనిచేస్తూ చనిపోయిన కార్మికుల కుటుంబంలో నుండి ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ టీయూసీఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. శనివారం ఇల్లెందు మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ సాధారణ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్, టీయూసీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు మృతుల కుటుంబాలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికులుగా అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న నలుగురు కార్మికులు అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు.
దీంతో మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, కమిషనర్ శ్రీకాంత్.. మృతుల కుటుంబాలు, యూనియన్ జిల్లా కార్యదర్శి యాకుబ్ షావలిని, కౌన్సిల్ సమావేశం చాంబర్‌కు పిలిపించి చర్చలు జరిపారు. ఇటీవల చనిపోయిన కార్మికుల కుటుంబాల నుండి ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరగా చైర్మన్, కమిషనర్ నాలుగు రోజులు టైం ఇవ్వాలని వాళ్లకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో కొమరయ్య, దేవులపల్లి మోహన్ రావు, అక్కపాక శ్రీధర్, జాడి శివకుమార్ పాల్గొన్నారు.

ఇల్లెందు మున్సిపల్ కార్యాలయం ముందు టీయూసీఐ ధర్నా