Rahul Gandhi | ఒక్క పరీక్షను నిజాయితీగా నిర్వహించలేదు.. విద్యా వ్యవస్థను మోదీ నాశనం చేశారు: రాహుల్ గాంధీ
Rahul Gandhi | ఒక్క పరీక్ష కూడా నిజాయితీగా నిర్వహించలేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘సమస్త విద్యా వ్యవస్థను’ పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఒక్క పరీక్ష కూడా నిజాయితీగా నిర్వహించలేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘సమస్త విద్యా వ్యవస్థను’ పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు. శనివారం దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG 2026) నిర్వహణలో ఆలస్యం జరిగింది. రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. ‘నీట్, సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ, ఇప్పుడు క్యూట్. నాలుగు పరీక్షలు. కోటి మంది విద్యార్థులు. ఒక్క పరీక్ష కూడా నిజాయితీగా నిర్వహించలేదు’ అని విమర్శించారు. ‘విశ్వగురు’ అనే వాదనలను సవాల్ చేశారు. ప్రధాని మోదీ సమస్త విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు. ‘మీరు ఏ తరం భవిష్యత్తును నాశనం చేస్తున్నారో, అదే తరం మిమ్మల్ని జవాబుదారీగా నిలబెడుతుంది’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, సీయూఈటీ ఆలస్యం జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో మరో వైఫల్యమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం అతిషి విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మరోవైపు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపై స్పందించారు. అతిషి పోస్ట్‌ను ఆయన షేర్ చేశారు. ‘దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలి’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రకారం ప్రధాని మోదీకి మాస్టర్స్ డిగ్రీ ఉన్నదని ఎద్దేవా చేశారు.
అలాగే జాతీయ స్థాయి పరీక్షల్లో పదే పదే జరుగుతున్న సంస్థాగత వైఫల్యాలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని ప్రతిపక్షాలు కోరాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
NEET। CBSE। SSC। और आज CUET।
चार परीक्षाएँ। एक करोड़ बच्चे। एक भी ईमानदारी से नहीं हो पाई।
दावे “विश्वगुरु” के, मगर देश में एक परीक्षा नहीं करवा सकते – मोदी जी ने पूरी शिक्षा व्यवस्था तबाह कर दी है।
जिस पीढ़ी का भविष्य आप बर्बाद कर रहे हैं – वही पीढ़ी आपका हिसाब करेगी।
— Rahul Gandhi (@RahulGandhi) May 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

