Vinesh Phogat: 53 కేజీల కేటగిరీలో.. వినేశ్ పోగట్ ఫస్ట్ విక్టరీ
Vinesh Phogat: ఆసియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ పోగట్ ఫస్ట్ విక్టరీ కొట్టింది. ఇవాళ జరిగిన తొలి బౌట్లో ఆమె 7-0 తేడాతో రెజ్లర్ జ్యోతిని ఓడించింది. వినేశ్ పోగట్ ఈసారి 53 కేజీల కేటగిరీలో పోటీపడుతున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ : ఆసియా క్రీడల కోసం జరుగుతున్న సెలక్షన్ ట్రయల్స్ బౌట్లో రెజ్లర్ వినేశ్ పోగట్(Vinesh Phogat) విక్టరీ కొట్టింది. ఇవాళ జరిగిన ఓపెనింగ్ బౌట్లో ఆమె 7-1 స్కోరు తేడాతో రెజ్లర్ జ్యోతిపై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభంలో జాగ్రత్తగా ఉన్న వినేశ్ ఆ తర్వాత బౌట్ సాగుతున్న కొద్దీ మెరుగైన గేమ్‌ను ప్రదర్శించింది. తొలుత పుష్ పాయింట్, ఆ తర్వాత డబుల్ లెగ్ అటాక్‌కు దిగింది. ప్రత్యర్థికి ఎటువంటి పాయింట్లు ఇవ్వకుండా జాగ్రత్తపడింది.
ఇక సెకండ్ పీరియల్లో వినేశ్ పోగట్ పూర్తిగా డామినేట్ చేసింది. రైట్ లెగ్ అటాక్‌ను వాడుకుని 3-0తో ఆధిపత్యం చాటింది. రెజ్లర్ జ్యోతి కూడా లెగ్ అటాక్‌కు దిగినా.. ఆ ఫైట్‌లో వినేశ్ విజేతగా నిలిచింది. కౌంటర్ అటాక్‌లో వరుసగా రెండు క్విక్ మూవ్స్‌తో 7-0 స్కోరు సాధించింది వినేశ్. జ్యోతి ఒక పుష్ ఔట్ పాయింట్ గెలుచుకున్నది.
వినేశ్ తన తర్వాత బౌట్లో నిషూతో ఆడనున్నది. రెజ్లర్ వినేశ్‌కు తొలుత రెజ్లింగ్ సమాఖ్య సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించింది. అయితే 53 కేజీల కేటగిరీలో వినేశ్ ఆడేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

