ముంబైలో జరిగిన 2026 ఆసియా క్రీడల మొదటి సెలక్షన్ ట్రయల్స్‌లో తెలంగాణ సెయిలర్లు పతకాల పంట పండించారు. పలు విభాగాల్లో పోటీపడిన రాష్ట్ర క్రీడాకారులు.. ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో సత్తాచాటారు.
సుమారు 15 నెలల విరామం తర్వాత తమపై విధించిన నిషేధాన్ని ఎత్తేసిన మరుసటి రోజే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) రాబోయే ఆసియన్ చాంపియన్‌షిప్స్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది.
ఇండోర్(మధ్యప్రదేశ్) వేదికగా ఈనెల 22 నుంచి మార్చి 18 వరకు జరిగే అండర్-17 భారత మహిళల ఫుట్‌బాల్ సెలెక్షన్ ట్రయల్స్‌కు రాష్ర్టానికి చెందిన చైతన్య శ్రీ ఎంపికైంది.