హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ ఆర్చర్ తానిపర్తి చికీత సత్తాచాటింది. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరుపిస్తూ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు కొల్లగొట్టిన చికీత తాజాగా ఏషియన్ జూనియర్ ఆర్చరీ టోర్నీకి ఎంపికైంది. ఇటీవలే ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్‌నకు సెలెక్ట్ అయిన చికీత..ఏషియన్ సెలెక్షన్ ట్రయల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది.
కోల్‌కతా వేదికగా జాతీయ ఆర్చరీ అసోసియేషన్ నిర్వహించిన మహిళల కాంపౌండ్ విభాగం అర్హత పోటీల్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈ యువ ఆర్చర్ 17.25 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ప్రతీకా ప్రదీప్(మహారాష్ట్ర) 17.75తో అగ్రస్థానంలో నిలిచింది. రానున్న ఏషియన్ టోర్నీతో పాటు ఆర్చరీ వరల్డ్‌కప్‌లో సత్తాచాటుతానని ఈ యువ ఆర్చర్ ధీమా వ్యక్తం చేసింది.