కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో సహా ఆతిథ్య దేశంగా ఉండి తమ అన్ని మ్యాచ్‌లనూ సొంత దేశంలోనే ఆడినా సూపర్-8 కూడా దాటలేకపోయిన శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ. సుమారు ఏడాదిన్నరగా ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెడ్‌కోచ్ సనత్ జయసూర్య ఆ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు.
శనివారం పాకిస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు విలేకరులతో మాట్లాడుతూ.. ‘నా కాంట్రాక్ట్ జూన్‌లో ముగుస్తుంది. కానీ అంతకంటే ముందే నేను జట్టును వీడాలనుకుంటున్నాను. ఇదే విషయమై నేను శ్రీలంక క్రికెట్‌తో చర్చిస్తున్నా’ అని తెలిపాడు. సూపర్-8లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడినందుకు గాను అతడు లంక అభిమానులకు క్షమాపణ చెప్పాడు.