హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండోర్(మధ్యప్రదేశ్) వేదికగా ఈనెల 22 నుంచి మార్చి 18 వరకు జరిగే అండర్-17 భారత మహిళల ఫుట్‌బాల్ సెలెక్షన్ ట్రయల్స్‌కు రాష్ర్టానికి చెందిన చైతన్య శ్రీ ఎంపికైంది.
సెలెక్షన్ ట్రయల్స్ నుంచి ఎంపిక చేసిన భారత జట్టు బంగ్లాదేశ్‌లో మార్చిలో జరిగే సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతుంది. అండర్-17 సెలెక్షన్‌కు ఎంపికైన చైతన్యను ఫాల్గుణ అభినందించారు.