ఢిల్లీ : సుమారు 15 నెలల విరామం తర్వాత తమపై విధించిన నిషేధాన్ని ఎత్తేసిన మరుసటి రోజే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) రాబోయే ఆసియన్ చాంపియన్‌షిప్స్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది. మార్చి 25-30 మధ్య జోర్డాన్‌లోని అమ్మన్ వేదికగా జరగాల్సి ఉన్న ఈ పోటీలకు గాను ఈనెల 15 నుంచి సెలెక్షన్ ట్రయల్స్‌ను నిర్వహించనుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మెన్స్ ఫ్రీస్టయిల్, ఉమెన్స్ రెజ్లింగ్, గ్రీకో-రోమన్ స్టయిల్ విభాగాల్లో సెలెక్షన్స్ జరుగుతాయని డబ్ల్యూఎఫ్ఐ ఒక ప్రకటనలో తెలిపింది.