హైదరాబాద్, ఆట ప్రతినిధి: ముంబైలో జరిగిన 2026 ఆసియా క్రీడల మొదటి సెలక్షన్ ట్రయల్స్‌లో తెలంగాణ సెయిలర్లు పతకాల పంట పండించారు. పలు విభాగాల్లో పోటీపడిన రాష్ట్ర క్రీడాకారులు.. ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో సత్తాచాటారు.
అండర్-18 స్కిఫ్ విభాగంలో కొమరవెల్లి లాహిరి-ఈశ్వ సూరగాణి జోడీ అగ్రస్థానాన నిలిచి పసిడి కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో దీక్షిత-అబ్దుల్ రహీమ్ ద్వయం రజతం గెలిచింది. సీనియర్ స్కిఫ్ క్లాస్‌లో తనుజ కామెశ్వర్-ధరణి లావేజీ జోడీ సిల్వర్‌తో మెరువగా వినోద్-అరవింద్ జంట కాంస్యం నెగ్గింది.