Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై.. మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ
Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చర్యలు చేపట్టింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై (Siddaramaiah) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చర్యలు చేపట్టింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, ఆయనకు భూమిని అమ్మిన దేవరాజుపై సెప్టెంబర్ 27న మైసూరు లోకాయుక్త నమోదు చేసిన కేసును ఈసీ పరిగణనలోకి తీసుకున్నది. ఈ నేపథ్యంలో వారిపై ఈడీ కేసు నమోదుకు ఎన్ఫోర్స్మెంట్ కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్)ను దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్లను ఈసీఐఆర్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితులకు ఈడీ సమన్లు జారీ చేసి ప్రశ్నించడంతోపాటు వారి ఆస్తులను అటాచ్ చేసే అవకాశం ఉంది.
కాగా, సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి ఆమె సోదరుడు బహుమతిగా ఇచ్చిన భూమిని ముడా సంస్థ స్వాధీనం చేసుకున్నది. ఆ భూమికి బదులుగా కోట్ల విలువైన 14 ప్లాట్లను ఆమెకు కేటాయించింది. ఇందులో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు కర్ణాటకలోని ప్రతిపక్షమైన బీజేపీ ఆరోపించింది. దీంతో సీఎం సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు.
మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. అనంతరం లోకాయుక్త పోలీసుల విచారణకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు కూడా గత వారం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, బావమరిది, భూమిని అమ్మిన వ్యక్తిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ కూడా సోమవారం కేసు నమోదు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CM Siddaramaiah
- ED
- Files
- karnataka
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

