INDvsSA: సిరీస్ ఆరంభానికి ముందే సఫారీలకు భారీ షాక్.. కీలక పేసర్ ఔట్
INDvsSA: ఎడమ మడమకు గాయం బాధపడుతున్న ఎంగిడి టీ20 సిరీస్ లో రెండు మ్యాచ్‌లకు మాత్రమే ఎంపికైనా ఇప్పుడు మొత్తానికీ దూరం కావడంతో సఫారీలు అనుభవజ్ఞుడైన పేసర్‌ను కోల్పోయారు.
INDvsSA: స్వదేశంలో భారత్‌తో ఆదివారం జరుగబోయే టీ20 సిరీస్ ఆరంభానికి ముందే దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తాకింది. ఆ జట్టు కీలక పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైనట్టు తెలుస్తోంది. ఎడమ మడమకు గాయం బాధపడుతున్న ఎంగిడి టీ20 సిరీస్ లో రెండు మ్యాచ్‌లకు మాత్రమే ఎంపికైనా ఇప్పుడు మొత్తానికీ దూరం కావడంతో సఫారీలు అనుభవజ్ఞుడైన పేసర్‌ను కోల్పోయారు. ఎంగిడి స్థానంలో ప్రొటీస్ జట్టు బ్యూరన్ హెండ్రిక్స్‌ను జట్టులోకి తీసుకుంది.
భారత్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లకు మాత్రమే ఎంపికైన ఎంగిడి తర్వాత జరుగబోయే వన్డేలకు అందుబాటులో లేడు. టెస్టు జట్టులో కీలకమైన ఎంగిడి.. టెస్టు సిరీస్ ఆరంభం (డిసెంబర్ 26) వరకైనా కోలుకోవాలని సఫారీలు ఆశిస్తున్నారు. ఎంగిడి లేకపోవడం సఫారీ బౌలింగ్ దళానికి సవాల్‌తో కూడుకున్న పనే. ఎంగిడి స్థానంలో జట్టులోకి వచ్చిన హెండ్రిక్స్ రెండేండ్లుగా ఒక్క టీ20 కూడా ఆడలేదు. కగిసొ రబాడాను ఈ ఫార్మాట్లో ఎంపిక చేయలేదు. అన్రిచ్ నోర్జే కూడా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు.
Lungi Ngidi ruled out of the T20i series against India due to an ankle sprain.
Beuran Hendricks has replaced him. (Espncricinfo). pic.twitter.com/zDEbLo7e9z
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 8, 2023
కీలక పేసర్లు దూరమైన నేపథ్యంలో దక్షిణాఫ్రికా మార్కో జాన్సెన్, గెరాల్డ్ కొయెట్జ్ల మీదే అధికంగా ఆధారపడనుంది. వీళ్లిద్దరితో పాటు లిజాడ్ విలియమ్స్, బార్ట్‌మన్ ఉన్నా ఈ ఇద్దరిలో తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. ఒకవేళ సఫారీ జట్టు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే జాన్సెన్, కొయెట్జ్తో పాటు విలియమ్స్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఆల్ రౌండర్లు అయిన పెహ్లుక్వాయో, నండ్రె బర్గర్ కూడా సీమర్లుగా సేవలందించడం సఫారీలకు కలిసొచ్చే అంశమే. కేశవ్ మహారాజ్, తబ్రైజ్ షంసీలు స్పిన్ బాధ్యతలు మోయనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

