BCCI | టీమిండియా హెడ్‌కోచ్‌గా గంభీర్.. వాళ్లకు చాన్స్ లేనట్టేనా..?
BCCI : భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు బంపర్ ఆఫర్ వచ్చింది. ఐపీఎల్లో మెంటార్(Ipl Mentor)గా విజయవంతమైన గౌతీకి టీమిండియా హెడ్‌కోచ్ పదవికి పోటీ పడనున్నాడు.
BCCI : భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir)కు బంపర్ ఆఫర్ వచ్చింది. ఐపీఎల్లో మెంటార్‌గా విజయవంతమైన గౌతీకి టీమిండియా హెడ్‌కోచ్ పదవికి పోటీ పడనున్నాడు. దేశం తరఫున రెండు వరల్డ్ కప్‌లు గెలిచిన అతడిని భారత క్రికెట్ బోర్డు (BCCI) పెద్దలు తాజాగా సంప్రదించారట. అయితే.. గంభీర్ మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు.
ప్రస్తుతం గంభీర్ తన మాజీ జట్టు అయిన కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత ప్రధాన కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి మే 27 ఆఖరి తేదీ. ఆలోపు గంభీర్ స్పందించే చాన్స్ లేకపోలేదు.

భారత జట్టు రెండు ఐసీసీ ట్రోఫీ(2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్)లు గెలిచిన జట్టులో గౌతీ సభ్యుడు. అంతేకాదు ఐపీఎల్లో ఏడు సీజన్లు కోల్‌కతా కెప్టెన్‌గా వ్యవహరించన గౌతీ.. రెండుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపాడు. అయితే.. కోచ్‌గా మాత్రం అతడికి పెద్దగా అనుభవం లేదు. కానీ, ఒక ఆటగాడిగా అతడి సుదీర్ఘ అనుభవం టీమిండియాకు ఎంతో ఉపయోగపడే చాన్స్ ఉంది.
టీ20 వరల్డ్ కప్‌తో..
ప్రస్తుతం కోచ్‌గా సేవలందిస్తున్న రాహుల్ ద్రవిడ్(RahulDravid) పదవీ కాలం టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. దాంతో, ఆలోపై కొత్త కోచ్ నియామక ప్రక్రియను చేపట్టేందుకు ప్రకటన విడుదల చేసింది. దాంతో మాజీ కోచ్ రవిశాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్‌లు రేసులో ఉంటారని అనుకున్నారంతా. కానీ, వాళ్లు అందుకు సిద్ధంగా లేరు.
స్టీఫెన్ ఫ్లెమింగ్, రాహుల్ ద్రవిడ్

ఆ ఇద్దరు రేసులోనే..
అందువల్ల ఐపీఎల్ కోచ్‌గా హిట్ కొట్టిన స్టీఫెన్ ఫ్లెమింగ్(Stephen Fleming)ను కూడా కోచ్ పదవి చేపట్టాల్సిందిగా బీసీసీఐ పెద్దలు కోరారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన ఘనత ఫ్లెమింగ్ సొంతం. ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్(Justin Lagner) సైతం టీమిండియా హెడ్‌కోచ్ పదవిపై కన్నేశాడు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
- CS Shantikumari | ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వెంటనే తరలించాలి : సీఎస్ శాంతికుమారి
- Air India | బెంగళూరు బయలుదేరిన ఎయిర్ఇండియా విమానం.. ఎమర్జెన్సీగా ఢిల్లీలో ల్యాండింగ్..!
- Telangana Cabinet | 18న సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

