Air India | బెంగళూరు బయలుదేరిన ఎయిర్ఇండియా విమానం.. ఎమర్జెన్సీగా ఢిల్లీలో ల్యాండింగ్..!
Air India | న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. అత్యవసర కారణాలతో తిరిగి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండయింది.
Air India | న్యూఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం సాయంత్రం తిరిగి దేశ రాజధానికి వచ్చేసింది. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత ఎయిర్ కండిషనింగ్ యూనిట్లో మంటలు చెలరేగాయని సందేహాలు రావడంతో తిరిగి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి.
విమానం టేకాఫ్ తీసుకోగానే ఎయిర్ కండిషనింగ్ యూనిట్లో మంటలు చెలరేగాయన్న అనుమానాల మధ్య ఎమర్జెన్సీ ప్రకటించినట్లు అధికార వర్గాల కథనం. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని సురక్షితంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అందులో ప్రయాణిస్తున్న వారు బెంగళూరు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

