రోడ్డున పడేశారు!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న భూ భారతి ఆపరేటర్లు రోడ్డునపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారిని తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో భూ భారతి ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు.
- ఉద్యోగాలు కోల్పోతున్న భూ భారతి ఆపరేటర్లు
- అప్పుడు రెగ్యులర్ చేస్తామని.. ఇప్పుడు తొలగిస్తున్న కాంగ్రెస్ సర్కారు
- ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 91 మంది..
- 38 మందినే కొనసాగించాలని టీజీటీఎస్ ఆదేశం
- 15 నెలలుగా జీతాలివ్వకుండా గెంటేస్తున్న ప్రభుత్వం
- కలెక్టర్లకు వినతి పత్రాల అందజేసిన సిబ్బంది
హనుమకొండ, ఆగస్టు 3 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న భూ భారతి ఆపరేటర్లు రోడ్డునపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారిని తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో భూ భారతి ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 78 మండలాల్లో బఫర్, జిల్లా కో ఆర్డినేటర్, ఫీల్డ్ లెవల్ టెక్నికల్ స్టాఫ్ (ఎఫ్టీఎస్) కలిపి మొత్తం 91 మంది విధులు నిర్వహిస్తున్నారు. 2026 మార్చి నెలతో వీరి కాంట్రాక్టు గడువు ముగిసింది. మళ్లీ రెన్యువల్ అవుతుందని సంతోషపడ్డ ఎఫ్టీఎస్లకు నిరాశే ఎదురైంది. ఈ సారి కేవలం 38 మంది ఎఫ్టీఎస్ సేవలను మాత్రమే కొనసాగించాలని తెలంగాణ గ్లోబల్ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. దీంతో మిగిలిన 53 కుటుంబాలు తమ భవిష్యత్ ఏమిటనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నాయి.
15 నెలలుగా జీతాల్లేవ్..
అన్ని తహసీల్దార్, రెవెన్యూ డివిజన్, కలెక్టరేట్ కార్యాలయాల్లో భూ భారతి (గతంలో ధరణి) ప్రాజెక్టులో భాగంగా భూముల రిజిస్ట్రేషన్లు, భూ సంబంధిత సమస్యల కోసం గత పదేళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 91 మంది విధులు నిర్వర్తిస్తున్నా రు. అలాగే ఎన్నికలు, ఇతర సాంకేతిక పనులను రెగ్యులర్ ఉద్యోగులతో పాటు చేస్తున్నారు. అయితే 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 నెలల వేతనాలు రానప్పటికీ విధులు నిర్వర్తిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలో కొంతమందికే పనిచేసే అవకాశం కల్పించడంపై మండిపడుతున్నారు.
రిజిస్ట్రేషన్లు తక్కువగా అవుతున్నాయ నే సాకుతో తమకు తగ్గించడంపై వారు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గడానికి, తమకెలాంటి సంబంధం లేదని, మారెట్ పరిస్థితులు, భూముల కొనుగోలు, విక్రయాలు, ప్రభు త్వ విధానాలు ప్రభావం చూపుతున్నాయంటున్నా రు. కాగా సోమవారం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేయాలని హనుమకొండ జిల్లా ఇంచార్జి కలెక్టర్కు హనుమకొండ జిల్లా భూ భారతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మంచా ల సాయిరాం, సెక్రటరీ ముత్తినేని సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ సోమ సాగరిక, మండలాల ఎఫ్టీఎస్లు, అలాగే ఉమ్మడి జిల్లాలోని మిగతా చోట్ల కూడా వినతి పత్రాలు అందజేశారు.
అందరిని కొనసాగించాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూ భారతి ప్రాజెక్టు కింద ఉమ్మడి వరంగల్ జిల్లా లో మొత్తం 91 మంది మి విధులు నిర్వర్తిస్తు న్నాం. 2026 మార్చి తో మా కాంట్రాక్టు ముగిసింది. ఆ తర్వాత కే వలం 38 మందినే రెగ్యులర్ చేస్తున్నట్లు తెలంగాణ గ్లోబల్ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరిని ఉంచుతారో.. ఎవరిని తొలగిస్తారో అనేది స్పష్టత లేదు. దీం తో ఎఫ్టీఎస్లు ఆందోళన చెందుతున్నారు. 15 నెలలుగా వేతనాలు రాకున్నప్పటికీ విధు లు నిర్వర్తించాం. ప్రభుత్వం పునరాలోచన చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ అందరినీ కొనసాగించాలి. అలాగే పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలి. ప్రతి నెల 1న ఖాతాల్లో వేతనాలు జమచేయాలి.
-నాగరాజు, భూభారతి ఆపరేటర్, హనుమకొండ జిల్లా
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

