MI vs LSG | రాహుల్, పూరన్ సునామీ ఇన్నింగ్స్.. ముంబై ముందు భారీ టార్గెట్
MI vs LSG : పదిహేడో సీజన్ ఆఖరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కొండంత స్కోర్ కొట్టింది. ముంబై ఇండియన్స్ కంచుకోటలో చిచ్చరపిడుగు నికోలస్ పూరన్(75), కెప్టెన్ కేఎల్ రాహుల్(55)లు విధ్వంసం సృష్టించారు.
MI vs LSG : పదిహేడో సీజన్ ఆఖరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కొండంత స్కోర్ కొట్టింది. ముంబై ఇండియన్స్ కంచుకోటలో చిచ్చరపిడుగు నికోలస్ పూరన్(75), కెప్టెన్ కేఎల్ రాహుల్(55)లు విధ్వంసం సృష్టించారు. పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా చెలరేగిన వీళ్లు నాలుగో వికెట్‌కు 109 రన్స్ జోడించి భారీ స్కోర్‌కు బాటలు వేశారు. ఆ తర్వాత ఆయుశ్ బదొని(22 నాటౌట్), కృనాల్ పాండ్యా(12 నాటౌట్) మెరుపులతో లక్నో జట్టు 6 వికెట్ల నష్టానికి 214 రన్స్ కొట్టింది. బ్యాటింగ్ పిచ్ అయిన వాంఖడేలో ముంబైకి ఇది ఏమంత కష్టమైన లక్ష్యం కాకపోవచ్చు.
టాస్ ఓడిన లక్నోకు ఆదిలోనే ముంబై పేసర్ నువాన్ తుషార షాకిచ్చాడు. ఓపెనర్‌గా వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్(0)ను ఇన్‌స్వింగర్‌తో గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపాడు. దాంఓత లక్నో ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్(28) అండగా కేఎల్ రాహుల్(55) ఇన్నింగ్స్ నిర్మించాడు. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో రివ్యూతో బతికిపోయిన స్టోయినిస్.. అన్షుల్ కంబోజ్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాది ఊపు తెచ్చాడు. మరో ఎండ్‌లో రాహుల్ సైతం వేగం పెంచాడు.
Last 7 overs mein saas bhi nahi le paaye 😳🔥 pic.twitter.com/EDNBNrgnOo
— Lucknow Super Giants (@LucknowIPL) May 17, 2024
29 బంతుల్లోనే 75
అయితే.. ఈ జోడీని వీడదీసిన పీయూష్ చావ్లా తర్వాతి ఓవర్లో దీపక్ హుడా(11)ను పెవిలియన్ పంపాడు. 69 పరుగులకే మూడు వికెట్లు పడిన వేళ క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్(75) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్ రాహుల్‌తో పోటాపోటీగా బౌండరీలు బాదిన ఈ చిచ్చరపిడుగు 29 బంతుల్లోనే 75 రన్స్ కొట్టాడు. చివర్లో కృనాల్ పాండ్యా(12 నాటౌట్), ఆయుశ్ బదొని(22 నాటౌట్)లు దంచారు. రొమారియో షెపర్డ్ వేసిన 20వ ఓవర్లో బదొని రెండు సిక్సర్లు బాదడంతో లక్నో రెండొందలు కొట్టగలిగింది.
ICYMI‼️@mipaltan‘s 𝙏𝙚𝙖𝙢 𝙃𝙖𝙩𝙩𝙧𝙞𝙘𝙠👌👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvLSG pic.twitter.com/JScRXL9XNO
— IndianPremierLeague (@IPL) May 17, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

