Pawan Kalyan | పవన్‌కల్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారు. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఓజీ’ చిత్రంలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను పవన్ దాదాపుగా పూర్తి చేశారు. ఇంకా ఆయనకు సంబంధించి పదిహేను రోజుల వర్క్ మాత్రమే మిగిలివుంది. దీనికోసం జూన్ నెలాఖరు నుంచి పవన్‌కల్యాణ్ డేట్స్ ఇచ్చారట.
ఇక మిగతా షెడ్యూల్ మొత్తం పవన్ లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో పవన్‌కల్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతున్నదని తెలుస్తున్నది. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీయారెడ్డి, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, షాన్ కక్కర్, హరీశ్ ఉత్తమ్ ఇతర పాత్రధారులు. థమన్ స్వరాలందిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది.