ఓటరుస్లిప్‌ల పంపిణీ పూర్తి చేయాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఓటరు స్లిప్పుల పంపిణీ వందశాతం పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
- ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
మామిళ్లగూడెం, మే 17 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఓటరు స్లిప్పుల పంపిణీ వందశాతం పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరుకు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలియాల్సిన అవసరం ఉందని, ప్రతి ఓటరుకు స్లిప్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్‌స్లిప్‌ల పంపిణీ సంబంధిత బీఎల్వో ద్వారా చేపట్టాలని, ప్రతిరోజు సాయంత్రం 6గంటలకు పంపిణీ పురోగతిపై నివేదిక సమర్పించాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలని, ఏవేని చిన్న చిన్న మరమ్మతులు ఉంటే, వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో మొదటి విడత శిక్షణ ఈ నెల 20న, రెండోవిడత శిక్షణ ఈ నెల 26న ఉంటుందని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కోసం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 26న డిస్ట్రిబ్యూషన్ కేం ద్రం నుంచి పోలింగ్ సామగ్రి తీసుకొని, సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్లి, అకడే బస చేయాలన్నారు.
రిసెప్షన్ కేంద్రం నల్గొండలోని నాగార్జున కళాశాలలో ఉంటుందని, ఈ నెల 27న పోలింగ్ నేరుగా రిసెప్షన్ కేంద్రానికి పోలీస్ ఎసార్ట్తో వెళ్లాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 15 రూట్లు, ప్రతి రూటుకు రూట్ ఆఫీసర్ని నియమించామన్నారు. తహసీల్దార్లు సెక్టార్ అధికారులుగా, నయాబ్ తహసీల్దార్లు ఫ్లయింగ్ స్వాడ్‌గా, ఆర్ఐలు ప్రత్యేక వీడియో టీమ్‌లుగా నియమించినట్లు తెలిపారు. శుక్రవారం నుంచే విధుల నిర్వహణ చేపట్టాలని అన్నారు. ప్రత్యేక వీడియోటీమ్కు వీడియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్, ఆర్డీవోలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని అన్నారు.
ఓటింగ్ విధానంపై ఓటర్లకు అవగాహన కలిగేలా విసృ్తత ప్రచారం చేపట్టాలని, ఓటింగ్ విధానం, చేయదగినవి, చేయకూడని పనులపై ఫ్లెక్సీ రూపొందించి, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిషారంలో వేగం పెంచాలన్నారు. ప్రతిరోజు తహసీల్దార్ కనీసం 20 ఫైళ్లు సమర్పించాలన్నారు. రిజిస్ట్రేషన్లలో పెండింగ్ స్లాట్లపై ప్రత్యేక దృషి ్టపెట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, డీఆర్డీవో ఎం.రాజేశ్వరి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, కలెక్టరేట్ ఏవో అరుణ, సూపరింటెండెంట్లు మదన్‌గోపాల్, అనురాధబాయి, రాంబా బు, సత్యనారాయణ, ఓఎస్డీ నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

