Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా(Manika Batra) పోరాటం ముగిసింది. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన ఆమె ప్రీ క్వార్టర్స్‌లోనే ఓటమి పాలైంది. 16వ రౌండ్లో జపాన్‌కు చెందిన మియు హిరనో(Miu Hirano) ధాటికి నిలువలేక చేతులెత్తేసింది.
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో మనికా ఆదిలో దూకుడుగా ఆడినా ఆ తర్వాత మిరనో జోరుకు తలొంచింది. ఎనిమిదో ర్యాంకర్ అయిన మిరనో ఆటాకింగ్ గేమ్‌తో భారత పెడ్లర్‌పై పైచేయి సాధించింది. దాంతో, చివరకు 6-11, 9-11, 14-12, 8-11, 6-11తో మనికా మ్యాచ్ చేజార్చుకుంది.
Chin up, Manika. You fought till the end. 👑
We’re with you—onwards and upwards! 💪#ManikaBatra #UTT4India #TeamIndia #UTT #UltimateTableTennis #TableTennis pic.twitter.com/BPw20ODhSy
— Ultimate Table Tennis (@UltTableTennis) July 31, 2024
విశ్వ క్రీడల్లో రెండో రౌండ్లో మనికా బత్రా దుమ్ము రేపింది. స్థానిక క్రీడాకారిణి అయిన ప్రిథికా పవడేపై 4-0తో జయకేతనం ఎగురవేసి దర్జాగా 16వ రౌండ్లో అడుగుపెట్టింది. దాంతో, ఒలింపిక్స్‌లో ప్రీ క్వార్టర్స్‌కు చేరిన రెండో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా మనికా బత్రా చరిత్ర సృష్టించింది. అయితే.. మియు హిరనో జోరుకు ముందు నిలవలేక క్వార్టర్స్ బెర్తు సాధించలేకపోయింది. దాంతో, ఇక ఆకుల శ్రీజ(Aakula Sreeja)పైనే పతక ఆశలు ఆధారపడి ఉన్నాయి.