DK Shivakumar Meets PM | ప్రధాని మోదీని కలిసి డీకే శివకుమార్.. ఎందుకంటే?
DK Shivakumar Meets PM | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బెంగళూరు అభివృద్ధి, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు.
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. (DK Shivakumar Meets PM) బెంగళూరు అభివృద్ధి, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. గుజరాత్ గిఫ్ట్ సిటీ తరహాలో బెంగళూరును అభివృద్ధి చేయాలని కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని చెప్పారు. ఆ అభ్యర్థనను సానుకూలంగా పరిగణించకపోవడంతో టన్నెల్ ప్రాజెక్ట్, సిగ్నల్ రహిత కారిడార్, ప్రధాన రహదారులు, బెంగుళూరులో తుఫాను నీటి కాలువల అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం మరిన్ని నిధులు కోరామని అన్నారు.
కాగా, జాతీయ ఖజానాకు అత్యధిక పన్నులు అందజేసే రెండో మహానగరం బెంగళూరు అని డీకే శివకుమార్ తెలిపారు. అయితే కేంద్ర బడ్జెట్లో ఏమీ కేటాయించలేదని విమర్శించారు. అందుకే మౌలిక సదుపాయాలకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఎగువ తుంగభద్ర ప్రాజెక్టుపై గత బడ్జెట్లో రూ. 5,300 కోట్లు కేటాయించినప్పటికీ కేంద్రం ఎలాంటి నిధులను విడుదల చేయకపోవడాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.
మరోవైపు తమిళనాడుకు నిర్దేశిత నీటి కంటే అదనపు నీటిని జూలైలో విడుదల చేయడంపై ప్రధాని మోదీకి వివరించినట్లు డీకే శివకుమార్ తెలిపారు. మహాదాయి సమస్యపై జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. అయితే రెండు రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

