ED Raids | హైదరాబాద్‌లోని మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంకులో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సోదాలు నిర్వహించింది. రూ.300కోట్ల నిధుల గోల్మాల్ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. అనర్హులకు రుణాలు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ సిటీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లోని ఆరు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్ బ్యాంకు చైర్మన్ రమేశ్ కుమార్, ఎండీ పురుషోత్తం దాస్‌తో పాటు సీఈవో, డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు జరుగుతున్నాయి. సోలిపురం వెంకట్‌రెడ్డి నివాసంలోనూ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను హవాలా ద్వారా మళ్లించినట్లుగా ఈడీ గుర్తించింది. తనిఖీలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.