ICC Rankings : న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత మహిళా క్రికెటర్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings)లో సత్తా చాటారు. మూడు వన్డేల సిరీస్‌లో బంతితో మ్యాజిక్ చేసిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) 687 పాయింట్లతో రెండో ర్యాంక్ సాధించింది. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ అదరగొడుతూ నాలుగో స్థానంలో నిలిచింది. ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగిన ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) బ్యాటింగ్ విభాగంలో నాలుగో ర్యాంక్‌కు ఎగబాకింది.
ఐసీసీ మంగళవారం వన్డే బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ మూడు కేటగిరీల్లో టీమిండియా నుంచి దీప్తి, మంధానలు మాత్రమే టాప్ 10లో నిలిచారు. బ్యాటింగ్ ర్యాకింగ్స్లో ఇంగ్లండ్ క్రికెటర్ నాట్ సీవర్ బ్రంట్ అగ్రస్థానం సాధించింది. టీ20 వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్ రెండో స్థానంలో ఉండగా.. లంక సారథి చమరి ఆటపట్టు మూడు, స్మృతి మంధానలు మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నారు.
Deepti Sharma climbed to No.2 in the ICC Women’s ODI Player Rankings for bowlers with key performances in the #INDvNZ series.
Check out the other rankings changes ➡️ https://t.co/8RKETxCTig pic.twitter.com/zNMNqns6F9
— ICC (@ICC) October 29, 2024
ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో సఫారీ క్రికెటర్ మరినే కాప్ టాప్‌లో ఉంది. విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ రెండు, నాట్ సీవర్ బ్రంట్ మూడు, దీప్తి వరుసగా నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైన అమేలియా కేర్ 356 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌కు పొట్టి వరల్డ్ కప్ కలను నిజం చేసిన కెప్టెన్ సోఫీ డెవినె (Sophie Devine) ఏడో ర్యాంక్ కైవసం చేసుకుంది.