NTR Neel | టాలీవుడ్ నుంచి కెరీర్ మొదలుపెట్టి గ్లోబల్ స్టార్‌గా సూపర్ స్టార్డమ్ సంపాదించిన అతికొద్ది యాక్టర్లలో ఒకడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తారక్ ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్టు 1తో ప్రేక్షకుల ముందుకొచ్చి నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించాడు. ఇక ఈ ప్రాంఛైజీలో దేవర పార్టు 2 కూడా ఉండబోతుందని తెలిసిందే.
స్టన్నింగ్ గెటప్స్‌లో పార్టు-1 లో కనిపించిన తారక్ సీక్వెల్లో ఎలా కనిపించబోతున్నాడోనంటూ తెగ చర్చించుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో NTRNeel సినిమా కూడా చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే నెట్టింట ఇప్పుడొక స్టిల్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలుస్తోంది.
తారక్ పదునైన ఆయుధాన్ని భుజంపై పెట్టుకొన్న లుక్ ఇప్పుడు ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ తాజా లుక్ ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిందా..? లేదంటే దేవర పార్టు 2 సినిమాదా..? అనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది. మరి ఈ స్టిల్ వెనుకున్న సీక్రెట్ గురించి తారక్ ఏదైనా క్లారిటీ ఇస్తాడేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
NTR Neel 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో సప్తసరాగాలు దాటి ఫేం రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుందని వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
New stills of #JrNTR from what seems to be #DevaraPart2 doing the rounds!#NTR‘s intensity in these weapon-wielding postures is creating a huge buzz, with some saying they are from #NTRNeel i.e., #Dragon 🐉#ManofMassessNTR #SSMB29 #RT75 #RaghavaLawrence #HariHaraVeeraMallu pic.twitter.com/3CYQ4rstBn
— Kunal Mondal Film Producer (@k89467324) October 29, 2024
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా..?
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..