Bomb Threat | ఏపీలోని విశాఖపట్నం విమానాశ్రయానికి వరుసగా రెండోరోజు బాంబు బెదిరింపులు కొనసాగాయి. మంగళవారం చెన్నై, బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చిన ఇండిగో విమానాలకు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులకు సాయంత్రం 5.36 గంటలకు ‘ఎక్స్’ వేదికగా ద్వారా బెదిరింపు వచ్చింది. అలాగే, చెన్నై నుంచి వైజాగ్‌కు వెళ్లే ఇండిగో విమానానికి సైతం బెదిరింపులు రాగా.. విమానాలు రెండు సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్ రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విమానాలను ఐసోలేషన్ బేస్‌కు తరలించామన్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు విమానాలకు సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చిందని.. బోర్డింగ్ ప్రోగ్రెస్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా విమానాలు మళ్లీ టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్నాయని రాత్రి 8 గంటల ఎయిర్పోర్ట్ అధారిటీ వెల్లడించింది.