Srisailam Temple | శ్రీశైలం : ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో త్రయోదశి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఉదయం కుమారస్వామికి మంగళవారం విశేషార్చనలు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం సంధ్యా సమయంలో నందిమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక క్రతువులు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని అర్చకపండితులు మహా సంకల్పాన్ని పఠించి పంచామృతాలు, ఫలోదకాలతోపాటు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింప జేసి పంచసూక్తం వృషభసూక్త ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల పూజలు నిర్వహించారు.