Tim Paine : భారత్, ఆస్ట్రేలియాల మధ్య టెస్టు సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. నవంబర్ 22న పెర్త్ మైదానంలో ఇరుజట్ల మధ్య బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy)కి తెరలేవనుంది. హ్యాట్రిక్ విజయంపై టీమిండియా ధీమాగా ఉండగా.. వరుస పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్లో భారత్, ఆస్ట్రేలియాల పోరు అంటే ‘నువ్వా నేనా’ అన్నట్టు సాగుతుంది. కంగారూ పేస్ దళానికి భారత ఆటగాళ్లు బ్యాటుతో సమాధానమిస్తుంటే అభిమానులు సంబురపడిపోతారు.
ఇక స్లెడ్జింగ్ కూడా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో మస్త్ పాపులర్. ఇరుజట్ల క్రికెటర్లు మాటల యుద్ధానికి దిగుతూ.. వెటకారపు కామెంట్లతో కవ్వించుకుంటూ ఆటను మరింత రక్తి కట్టిస్తారు. అలాంటి సంఘటనల్లో ఒకటి 2021లో జరిగింది. అప్పటి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ఆ స్లెడ్జింగ్ సంగతులను పంచుకున్నాడిలా.
Tim Paine defends his ‘Come to Gabba’ sledge by adding that Ashwin actually didn’t play in that Test. 😅
Ashwin had replied, “Just like we wanna get you to India. That will be your last series.” That also didn’t happen as the series in AUS was his lastpic.twitter.com/VBgVa0wKfT
— Omkar Mankame (@Oam_16) October 29, 2024
ఆస్ట్రేలియాకు 2021లో వెళ్లిన భారత జట్టు ట్రోఫీతో తిరిగొచ్చింది. సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ అసమాన పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. శరీరం సహకరించకున్నా సరే హనుమ విహరితో కలిసి అద్భుత పోరాటం చేశాడు. ఆ సమయంలోనే ఆసీస్ సారథి పైన్‌కు చిర్రెత్తుకొచ్చింది. దాంతో, అతడు అశ్విన్‌ను టార్గెట్ చేస్తూ స్లెడ్జింగ్‌కు తెరతీశాడు. ‘నిన్ను గబ్బాకు తీసుకెళ్లేందుకు నేను ఆగలేకపోతున్నా. అక్కడ మేమేంటో చూపిస్తాం’ అని అన్నాడు. అయితే.. తన వ్యూహం ఫలించలేదని చెప్పిన పైన్ ఇంకా ఏం అన్నాడంటే.. ‘నన్ను ప్రతిసారి అశ్విన్ ఔట్ చేస్తుండేవాడు.
Tim Paine x Curb Your Enthusiasm #IndvAus pic.twitter.com/NDSkVXFzY6
— Vithushan Ehantharajah (@Vitu_E) January 19, 2021
చెప్పాలంటే తన స్పిన్‌తో అశ్విన్ నన్ను భయపెట్టాడు. అందుకనే సిడ్నీ టెస్టులో అతడు క్రీజులోకి రాగానే నోటికి పని చెప్పాను. అయితే.. నా ఎత్తుగడ ఫలించలేదు. మమ్మల్ని తరచూ ఇబ్బంది పెడుతున్నాడనే అశ్విన్‌ను టార్గెట్ చేశా. కానీ, అతడు గొప్ప క్రికెటర్’ అని పైన్ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో అశ్విన్, విహరి జోడీ 259 బంతుల్ని ఎదుర్కొని.. 62 పరుగులు చేసింది. అంతేకాదు పైన్ నోటిదురుసుకు అశ్విన్.. నిన్ను ఇండియాలో చూడాలనుకుంటున్నా.. అదే నీకు ఆఖరి సిరీస్ అని గట్టి కౌంటర్ ఇచ్చాడు.