India-China | తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ ముగిసినట్లే..!
India-China | తూర్పు లద్దాఖ్‌లో ఎల్ఏసీ వెంట గత నాలుగేళ్లుగా నెలకొన్న ప్రతిష్ఠంభన ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల భారత్, చైనా మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలవగా.. మంగళవారం నాటికి దాదాపు 90శాతం పూర్తయ్యిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి.
India-China | తూర్పు లద్దాఖ్‌లో ఎల్ఏసీ వెంట గత నాలుగేళ్లుగా నెలకొన్న ప్రతిష్ఠంభన ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల భారత్, చైనా మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలవగా.. మంగళవారం నాటికి దాదాపు 90శాతం పూర్తయ్యిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో బలగాలు వెనక్కి మళ్లే ప్రక్రియ ముగిసినట్లేనని తెలిపాయి. భారత్, చైనా సైన్యాలు ఒకరి స్థావరాలను మరొకరు పరస్పరం తనిఖీ చేసుకుంటున్నాయని.. మౌలిక సదుపాయాలను సైతం తొలగించారా? లేదా? అనే విషయం క్లారిటీ కోసమే తనిఖీలు జరుగుతున్నాయని తీయ మీడియా పేర్కొంది.
తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి పెట్రోలింగ్, దళాల ఉపసంహరణకు భారత్, చైనా ఒప్పందాన్ని కుదిరింది. దాంతో గాల్వాన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్, చైనా సైన్యం మధ్య కమాండర్ చర్చలు జరిగాయి. అదే సమయంలోనూ దౌత్య మార్గంలోనూ చర్చలు జరగ్గా.. ఇటీవల బలగాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించడంతో నాలుగేళ్ల ప్రతిష్ఠంభనకు తెరపడినట్లయ్యింది. ఇరుదేశాల మధ్య ఒప్పందం జరగ్గా.. ఈ ఒప్పందానికి ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆమోదం తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Demchok
- Depsang
- india china
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

