IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ రిటెన్షన్ గడువు ముంచుకొస్తున్న వేళ అందరిలో ఉత్కంఠ. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోనున్న ఆ ఐదుగురు ఎవరు? అనే ప్రశ్న అభిమానుల బుర్రను తొలుస్తోంది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) రిటెన్షన్ జాబితాను ఖరారు చేసిందనే కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఈ జట్టు చిచ్చరపిడుగు నికోలస్ పూరన్ (Nicholas Pooran) మంగళవారం యజమాని సంజీవ్ గొయెంకా (Sanjeev Goenka)ను కలిశాడు.
కోల్‌కతాలోని ఆర్సీఎస్పీ కార్యాలయంలో సంజీవ్‌తో మాట్లాడిన పూరన్ తొలి రిటెన్షన్‌గా సంతకం చేసినట్టు సమాచారం. అయితే.. అతడికి ఎంత మొత్తం చెల్లిస్తుందనేది తెలియాల్సి ఉంది. టీ20 స్పెషలిస్ట్ అయిన పూరన్‌ను 18వ సీజన్ కోసం లక్నో తొలి ప్రాధాన్యంగా అట్టిపెట్టుకోనుంది.
🚨Nicholas Pooran set to be the premier retention for LSG
Ravi Bishnoi, Mayank Yadav, Ayush Badoni and Mohsin Khan are the other players set to be retained by the franchise 🤯#IPLRetention #IPLAuction #nicholaspooran #lucknowsupergiants pic.twitter.com/yf3DF2FDkr
— Cricbuzz (@cricbuzz) October 29, 2024
విధ్వంసక ఇన్నింగ్స్‌లతో పలుమార్లు లక్నోను ఆదుకున్న విండీస్ వీరుడికి ఫ్రాంచైజీ ఈసారి భారీ మొత్తాన్ని ఆఫర్ చేయనుంది. 17వ సీజన్లో సంజీవ్ గొయెంకా కోపానికి బలైన కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫ్రాంచైజీతో కొనసాగేందుకు ఇష్ట పడడం లేదు. అందుకని రాహుల్‌కు చెల్లించే రూ.17 కోట్లకు ఇంకొకటి కలిపి రూ.18 కోట్లను లక్నో యాజమాన్యం పూరన్‌కు ఇవ్వనుందని టాక్.
ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో కెప్టెన్‌గానూ విజయవంతమైన పూరన్.. రాహుల్ స్థానంలో పగ్గాలు చేపట్టే అవకాశాలు లేకపోలేదు. 2022 మినీ వేలంలో పూరన్‌ను లక్నో రూ. 16 కోట్లుకు కొన్నది. అంతకుముందు సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ.2 కోట్లకే సొంతం చేసుకోవడం విశేషం. పూరన్ తర్వాత లక్నో అట్టిపెట్టుకునే వాళ్లలో పేస్ సంచలనం మయాంక్ యాదవ్ (Mayank Yadav), యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లు ఉండడం పక్కా.
Nicholas pooran to receive 18 cr from #IPL2025 by Lsg as retention player #IPLRetention2025 pic.twitter.com/3Dg1QPhH7i
— rashid khan (@rashidkhantwitt) October 28, 2024
ఇక అన్క్యాప్డ్ ప్లేయర్లుగా ఆకాశ్ బదొని, పేసర్ మొహ్సిన్ ఖాన్లు జట్టుతో కొనసాగుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న లక్నో ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. గత మూడు సీజన్లలో వరుసగా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌లోనే ఇంటిదారి పట్టింది. కానీ, 18వ సీజన్లో కప్పు కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అందుకు వీలుగా మెగా వేలంలో మ్యాచ్ విన్నర్లను కొనేందుకు లక్నో సిద్ధమవుతోంది.