Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. కంగువలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది సూర్య టీం.
కాగా కంగువ సినిమాకు సీబీఎఫ్సీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసింది. సినిమాలో పలు సవరణలు సూచించిన సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక కంగువ ఫైనల్ రన్‌టైం 2 గంటల 34 నిమిషాలు. యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్‌ను ఈ నిడివి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
కంగువ ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఈ మూవీని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుండగా.. ఓవర్సీస్ విషయానికొస్తే నార్త్ అమెరికాలో Prathyangira, యూకేలో యశ్ రాజ్ ఫిలిమ్స్ , సింగపూర్‌లో హోం స్క్రీన్, గల్ఫ్ దేశాల్లో Phars విడుదల చేస్తుంది.
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..