India vs England 2nd ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెన్ డకెట్ (56 బంతుల్లో 65; 10 ఫోర్లు), జో రూట్ (72 బంతుల్లో 69; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీసి లక్ష్యం మరింత పెరగకుండా కట్టడి చేశాడు. దాంతో 49.5 ఓవర్లలో ఇంగ్లండ్ 304 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ ముందు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్‌లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు ధాటిగా ఆడటంతో జట్టు స్కోరు కేవలం 10 ఓవర్లలోనే 80కి చేరువైంది. ఈ క్రమంలో మహ్మద్ షమీ వారి పార్ట్‌నర్‌షిప్‌కు తెరదించాడు. 11వ ఓవర్ ఐదో బంతికి ఫిలిప్ సాల్ట్ రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో మరో ఓపెనర్ బెన్ డెకెట్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 304 పరుగులు.
ఆ తర్వాత జో రూట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలోపడ్డాడు. అతనికి హ్యారీ బ్రూక్ (31), కెప్టెన్ జోస్ బట్లర్ (34) తమ వంతు సహకారం అందించారు. అనంతరం రూట్‌కు లివింగ్ స్టోన్ (41) జతచేరాడు. కానీ కాసేపటికే రూట్ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లివింగ్ స్టోన్ ఔటైన తర్వాత ఆదిల్ రషీద్ మినహా టెయిలెండర్స్ ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. జామీ ఓవర్టన్, అట్కిన్సన్ విఫలమయ్యారు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు. మరో ముగ్గురు బ్యాటర్లు రనౌట్ అయ్యారు.
HCA | త్వరలో టీపీఎల్.. ప్రతీ జిల్లాకు కోటి రూపాయల ఫండ్: హెచ్‌సీఏ
Dommaraju Gukesh | ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్.. నాకౌట్‌కు గుకేశ్
National Games | నిత్యకు రజతం.. నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్లు పతకాల వేట