India vs England 2nd ODI : భారత్ (India), ఇంగ్లండ్ (England) మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్నది. కటక్ (Cuttak) లోని బారాబతి స్టేడియం (Barabati stadium) లో రెండు జట్లు తలపడుతున్నాయి. తొలి వన్డేలో గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. అయితే మ్యాచ్ గెలిచి ఆధిక్యాన్ని సమం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
మ్యాచ్‌కు ముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌కు ఫీల్డింగ్ అప్పగించింది. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ దాదాపు 6 పరుగుల నెట్ రన్‌రేట్‌తో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. 30 ఓవర్ల ఆట ముగిసే సమయానికి కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగుల స్కోర్ చేసింది. భారత బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీయకపోతే ఇంగ్లండ్ 400 పరుగుల స్కోర్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్ 34 పరుగులతో, కెప్టెన్ జోస్ బట్లర్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. సాల్ట్ 26 పరుగులు, డకెట్ 65 పరుగులు చేసి ఔటయ్యారు. సాల్ట్ 11వ ఓవర్లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. డకెట్ 16వ ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్ హర్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 30వ ఓవర్లో హర్షితా రాణా హ్యారీ బ్రూక్ వికెట్ తీశాడు.
HCA | త్వరలో టీపీఎల్.. ప్రతీ జిల్లాకు కోటి రూపాయల ఫండ్: హెచ్‌సీఏ
Dommaraju Gukesh | ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్.. నాకౌట్‌కు గుకేశ్
National Games | నిత్యకు రజతం.. నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్లు పతకాల వేట