ICC | పరుగుల వీరుడికి ఐసీసీ అవార్డు.. ఇది ఆరంభమేనా..?
ICC : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) మరో ఘనత సాధించాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఇరగదీసిన ఈ చిచ్చరపిడుగు ఫిబ్రవరి నెలకుగానూ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'(Player Of The Month) అవార్డు అందుకున్నాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా క్రికెటర్...
ICC : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) మరో ఘనత సాధించాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఇరగదీసిన ఈ చిచ్చరపిడుగు ఫిబ్రవరి నెలకుగానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్'(Player Of The Month) అవార్డు అందుకున్నాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా క్రికెటర్ అనాబెల్ సథర్లాండ్(Annabel Sathurland) విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో సథర్లాండ్ డబుల్ సెంచరీతో చెలరేగింది. దాంతో, ఆమె యూఏఈ క్రికెటర్లను దాటేసి అవార్డు అందుకుంది.
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో 22 ఏండ్ల యశస్వీ పరుగుల వరద పారించాడు. రెండు డబుల్ సెంచరీలతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఓటింగ్‌లో కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంకలను వెనక్కి నెట్టి మరీ యశస్వీ విజేతగా అవతరించాడు.
Presenting the ICC Player of the Month for February 🙌
Congratulations, Yashasvi Jaiswal 👏👏
🗣️🗣️ Hear from the #TeamIndia batter on receiving the award@ybj_19 pic.twitter.com/tl1tJepdFJ
— BCCI (@BCCI) March 12, 2024
‘ఐసీసీ అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఈ అవార్డులు మరిన్ని సాధిస్తా. ఇంగ్లండ్ సిరీస్‌ను నేను ఎంతో ఆస్వాదించా. ఆ ఐదు టెస్టుల సిరీస్ నా కెరీర్లో ఎంతో ఉత్తమమైనది. నేను నా స్టయిల్లోనే ఆడాను. మేము 4-1తో సిరీస్ గెలిచాం. జట్టు సభ్యులతో పాటు ఆ విజయాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను’ అని యశస్వీ వెల్లడించాడు.
Australia’s star all-rounder wins the ICC Women’s Player of the Month award following an outstanding record-breaking performance in February 🔥
Read on 👇
— ICC (@ICC) March 12, 2024
రెండో భారత క్రికెటర్
యశస్వీ ఈ మధ్యే టెస్టుల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా చిన్న తక్కువ వయసులోనే ఈ మైలురాయికి చేరిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ చిచ్చరపిడుగు 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ(Vinod Kambli) 14 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి రన్స్ కొట్టాడు. నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పూజారా 18 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులతో మూడో స్థానానికి పడిపోయాడు.

ఇవి కూడా చదవండి
- Ananthkumar Hedge | రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు : రెండో జాబితా నుంచి కర్నాటక ఎంపీ పేరు గల్లంతు
- KTR | కేటీఆర్‌కు తీవ్ర జ్వరం.. కరీంనగర్ సభకు దూరం
- Donald Trump | నేను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. క్యాపిటల్ హిల్ బందీలను విడిపిస్తా : ట్రంప్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

