Donald Trump | మరోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడి ఘటనలో అరెస్టై జైల్లో ఉన్న వారిని బందీలుగా (US Capitol Hill hostages) అభివర్ణించారు. ఈ మేరకు తాను ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడితే ఆ బందీలను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే తాను తీసుకునే మొదటి చర్యల్లో అదీ ఒకటని వెల్లడించారు.
ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘నేను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. జనవరి 6న క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడిలో అన్యాయంగా జైల్లో ఉంచిన బందీలను విడిపిస్తా. మెక్సికో సరిహద్దును మూసేసి అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేస్తా (US-Mexico border). మీ తదుపరి అధ్యక్షుడిగా నేను తీసుకునే తొలి నిర్ణయాలు’ అని ట్రంప్ వాగ్దానం చేశారు.
Also Read..
Haiti PM | సాయుధ మూకల దాడులతో అట్టుడుకుతున్న హైతీ.. రాజీనామా చేసిన ప్రధాని ఏరియెల్
Seema Haider | సీఏఏ అమలును స్వాగతించిన పాక్ మహిళ సీమా హైదర్.. ప్రధాని మోదీపై ప్రశంసలు
Manohar Lal Khattar | హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా