Manohar Lal Khattar | హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా
Manohar Lal Khattar | లోక్సభ ఎన్నికల ముందు హర్యానా రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి (Haryana CM) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) మంగళవారం రాజీనామా ( resigns) చేశారు.
Manohar Lal Khattar | లోక్సభ ఎన్నికల ముందు హర్యానా రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమి విచ్ఛిన్నమైంది. హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ-జేజేపీ కూటమిలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి (Haryana CM) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) మంగళవారం రాజీనామా ( resigns) చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని గవర్నర్కు సమర్పించారు. మంత్రిమండలి సభ్యులు కూడా తమ రాజీనామాలను సమర్పించారు.
తాజా పరిణామంతో బీజేపీ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటకు 46 సీట్లు అవసరం. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి మెజారిటీ తక్కువ రావడంతో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
తాజా పరిణామంతో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సొతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ రోజే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. కాసేపట్లో బీజేపీఎల్పీ సమావేశం నిర్వహించి తదుపరి సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేసులో నయబ్సైనీ ఉన్నట్లు సమాచారం.
Also Read..
Shah Rukh Khan | షారుక్ ఖాన్కు పాదాభివందనం చేసిన స్టార్ దర్శకుడు అట్లీ.. VIDEO
Byjus | బైజూస్ ఆఫీసులు మూసివేత.. వర్క్ఫ్రం హోం చేయండంటూ ఉద్యోగులను కోరిన సంస్థ..!
Haiti PM | సాయుధ మూకల దాడులతో అట్టుడుకుతున్న హైతీ.. రాజీనామా చేసిన ప్రధాని ఏరియెల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

