Shah Rukh Khan | షారుక్ ఖాన్‌కు పాదాభివందనం చేసిన స్టార్ దర్శకుడు అట్లీ.. VIDEO
Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan)కు ప్ప్రముఖ దర్శకుడు అట్లీ పాదాభివందనం చేశారు.
Shah Rukh Khan | చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ల లిస్ట్‌లోకి చేరిపోయాడు అట్లీ (Atlee). మరీ ముఖ్యంగా జవాన్‌తో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా పలు అవార్డులను సైతం సొతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం జీ సినీ అవార్డుల్లో కూడా సత్తా చాటింది. ఇటీవలే జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జవాన్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అట్లీ అవార్డు అందుకున్నారు.
మార్చి 10వ తేదీన ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అవార్డు ప్రకటించగానే పక్కనే ఉన్న షారుక్‌కు అట్లీ పాదాభివందనం చేశారు (touches Shah Rukh Khans feet). దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పైకి లేచి చప్పట్లు కొట్టారు. అనంతరం స్టేజిపైకి వెళ్లి అట్లీ అవార్డు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అట్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదే వేడుకలో ఉత్తమ నటుడిగా షారుక్ కూడా అవార్డు అందుకున్నారు.
Congratulations to @Atlee_dir for winning the best Director Award for #Jawan. No arrogance, down to earth man. You deserve it. Keep rocking!💥pic.twitter.com/uLuMXNhJSW
— अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 11, 2024
Also Read..
Byjus | బైజూస్ ఆఫీసులు మూసివేత.. వర్క్‌ఫ్రం హోం చేయండంటూ ఉద్యోగులను కోరిన సంస్థ..!
Haiti PM | సాయుధ మూకల దాడులతో అట్టుడుకుతున్న హైతీ.. రాజీనామా చేసిన ప్రధాని ఏరియెల్
Defamation Case: కేంద్ర మంత్రిపై పరువునష్టం కేసు కొట్టివేత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

