Defamation Case: కేంద్ర మంత్రిపై పరువునష్టం కేసు కొట్టివేత
Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై షూటర్ వర్తికా సింగ్ వేసిన పరువునష్టం పిటీషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. లక్నో బెంచ్ ఈ కేసులో తీర్పును ఇచ్చింది. జర్నలిస్టులు వేసిన పిటీషన్‌కు కోర్టు స్పందిస్తూ, ఒకవేళ పిటీషనర్ కాంగ్రెస్ పార్టీకి చెందినా లేక గాంధీ ఫ్యామిలీకి చెందినా, అది పరువునష్టం కేసు కిందకు రాదు అని బెంచ్ పేర్కొన్నది.
లక్నో: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై షూటర్ వర్తికా సింగ్ వేసిన పరువునష్టం( Defamation Case) పిటీషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. లక్నో బెంచ్ ఈ కేసులో తీర్పును ఇచ్చింది. జర్నలిస్టులు వేసిన పిటీషన్‌కు కోర్టు స్పందిస్తూ, ఒకవేళ పిటీషనర్ కాంగ్రెస్ పార్టీకి చెందినా లేక గాంధీ ఫ్యామిలీకి చెందినా, అది పరువునష్టం కేసు కిందకు రాదు అని బెంచ్ పేర్కొన్నది. ఫయాజ్ ఆలమ్ ఖాన్‌కు చెందిన బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. మార్చ్ 5వ తేదీన వచ్చిన ఆ తీర్పును సోమవారం కోర్టు సైట్లో అప్లోడ్ చేశారు.
అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్ .. సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పరువునష్టం కేసును ఫైల్ చేశారు. 2022, అక్టోబర్ 21వ తేదీన స్పెషల్ కోర్టు ఆ కేసును రద్దు చేసింది. అయితే ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర మంత్రి పర్సనల్ సెక్రటరీ గురించి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రశ్న వేసిన సమయంలో.. మంత్రి స్మృతి దానికి సమాధానం ఇస్తూ పిటీషనర్ కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మ అని, గాంధీ కుటుంబంతో ఆమెకు నేరుగా లింకులు ఉన్నట్లు ఆరోపించారు.
అయితే ఆ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఎక్కడ కూడా పిటీషనర్ పేరును మంత్రి స్మృతి ఇరానీ ప్రస్తావించలేదని కోర్టు తెలిపింది. మంత్రి స్మృతి ఇరానీ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేవలం రాజకీయ పార్టీని విమర్శిస్తోందని, పిటీషనర్ను కించపరుచాలన్న ఉద్దేశం ఆమెకు లేదని బెంచ్ తన తీర్పులో పేర్కొన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

