భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) మైక్‌ను ఒక పోలీస్ అధికారి ఆపేశారు. దీంతో ఆ పోలీస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ తిరిగి రాని ప్రాంతానికి విసిరేస్తామని బెదిరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విదిషా లోక్‌సభ నియోజకవర్గం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేస్తున్నారు. గురువారం రాత్రి భోజ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే రాత్రి పది గంటలు కావడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు అనుగుణంగా మండిదీప్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మహేంద్ర సింగ్ ఠాకూర్ వ్యవహరించారు. ఎన్నికల ప్రచార సమయం ముగియడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మైక్‌ను ఆయన ఆపేశారు.
కాగా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తోపాటు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర పట్వా ఆ పోలీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మరింత రెచ్చిపోయారు. మళ్లీ తిరిగి రాని ప్రాంతానికి విసిరేస్తామని ఆ పోలీస్‌ను బెదిరించారు. అనంతరం మైక్ ఆన్ కావడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. బీజేపీ బెదిరింపులు, ఆ పార్టీ అహంకారంపై మండిపడింది.
बीजेपी का अहंकार देखो
चुनाव आचार संहिता का पालन कराने पर बीजेपी के मंच से पूर्व मुख्यमंत्री शिवराज सिंह चौहान ने सवाल किये और सुरेंद्र पटवा ने थाना प्रभारी महेंद्र सिंह ठाकुर को बदतमीज़ी करते हुए धमकाया।
शिवराज जी,
एक पूर्व मुख्यमंत्री का यह स्तर ?बेहद अशोभनीय और निंदनीय… pic.twitter.com/WTZws1q6mW
— MP Congress (@INCMP) May 3, 2024