IND vs BAN 1st Test : చెపాక్ టెస్టులో పట్టుబిగించిన టీమిండియా విజయానికి చేరువైంది. రెండో రోజు జస్ప్రీత్ బుమ్రా(4/50) ధాటికి కుప్పకూలిన బంగ్లాదేశ్‌ను మూడో రోజు శుభ్‌మన్ గిల్(119 నాటౌట్), రిషభ్ పంత్(109)లు శతకాలతో బెంబేలెత్తించారు. వీళ్లిద్దరి రికార్డు భాగస్వామ్యం అనంతరం భారీ ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. అశ్విన్ తిప్పేయగా మూడో సెషన్లో
నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే.. 10 ఓవర్లు ఉన్నాయనగా వెలుతురు తగ్గపోవడంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. దాంతో, మరో ఒకటి రెండు వికెట్లు తీయాలనుకున్న రోహిత్ సేనకు నిరాశే మిగిలింది.
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు గట్టిగానే ప్రతిఘటించారు. కానీ, బుమ్రా, అశ్విన్‌ల ధాటికి పర్యాటక జట్టు నాలుగు వికెట్లు కోల్పోక తప్పలేదు. అయితే.. ఆట ముగియడానికి మరో 10 ఓవర్లు ఉందనగా మైదానంలో చీకటి కమ్ముకుంది. దాంతో, అంపైర్లు లైట్మీటర్తో ఆట కొనసాగించాలా? వద్దా? అనేది చూశారు. కానీ, మేఘాలు కూడా కమ్ముకోవడంతో అంపైర్లు ఆట ముగిసిందని చెప్పారు. అప్పటికీ బంగ్లా స్కోర్.. 158. కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో (51 నాటౌట్), షకీబుల్ హసన్(5 నాటౌట్)లు నాటౌట్‌గా క్రీజును వీడారు.
Bad light brings an end to the day’s play.
Bangladesh 158/4, need 357 runs more.
See you tomorrow for Day 4 action 👋
Scorecard – https://t.co/jV4wK7BgV2#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/7JWYRHXQuY
— BCCI (@BCCI) September 21, 2024
తొలి టెస్టులో మూడో రోజు కూడా టీమిండియా జోరు కొనసాగించింది. ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్(119), రిషభ్ పంత్(109)లు బంగ్లా బౌలర్లకు ఏ అవకాశం ఇవ్వలేదు. ఎడాపెడా బౌండరీలు కొడుతూ స్కోర్‌బోర్డును ఉరికించారు. దాంతో, టీమిండియా ఆధిక్యం పెరుగుతూ పోయింది. ఈ క్రమంలోనే సుదీర్ఘ ఫార్మాట్లో గిల్ ఐదో సెంచరీ బాదేయగా.. తం పంత్ ఆరో శతకంతో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు సమం చేశాడు. పంత్ ఔటైనా కాసేపటికే కెప్టెన్ రోహిత్ 2 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.
An entertaining opening session for the Saturday crowd in Chennai as Shubman Gill and Rishabh Pant make run-scoring look easyhttps://t.co/i7S5QqEZ4M #INDvBAN pic.twitter.com/zWJLzeYtPA
— ESPNcricinfo (@ESPNcricinfo) September 21, 2024
ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాకు ఓపెనర్లు జకీర్ హసన్(33), షద్మాన్ ఇస్లాం(35)లు శుభారంభమిచ్చారు. నిలకడగా ఆడి తొలి వికెట్‌కు 61 రన్స్ జోడించారు. అయితే.. బుమ్రా ఓవర్లో యశస్వీ స్లిప్‌లో డైవింగ్ చేస్తూ అందుకున్న సూపర్ క్యాచ్‌కు జకీర్ వెనుదిరగాల్సి వచ్చింది. అక్కడితో వికెట్ల పతనం మొదలైంది.
Nicely pouched by Yashasvi Jaiswal 👏
(via @BCCI) #INDvBAN pic.twitter.com/Y9fy4PrpzP
— ESPNcricinfo (@ESPNcricinfo) September 21, 2024
ఆ వెంటనే అశ్విన్ తన మ్యాజిక్ చూపిస్తూ రెండు వికెట్లు తీశాడు. సహచరులు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(51 నాటౌట్) మాత్రం పట్టుదలగా ఆడాడు. షకీబుల్ హసన్(5 నాటౌట్)తో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. భారత జట్టు విజయానికి ఆరు వికెట్లు అవసరం కాగా.. బంగ్లా ఇంకా 357 రన్స్ కొట్టాలి. నాలుగో రోజు తొలి సెషన్లో బుమ్రా నేతృత్వంలోని టీమిండియా పేస్ దళాన్ని బంగ్లా బ్యాటర్లు ఏమేరకు ఎదుర్కొంటారో చూడాలి.