Ricky Ponting : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న రికీ పాంటింగ్ (Ricky Ponting) మళ్లీ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఏడు సీజన్లలో ఒక్కసారి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)ను చాంపియన్‌గా నిలపలేకపోయిన ఆసీస్ లెజెండ్ ఈసారి పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కోచ్ అయ్యాడు. 17వ సీజన్ తర్వాత పాంటింగ్‌పై వేటు పడడానికి ఢిల్లీ చెత్త ప్రదర్శనే కారణమని అనుకున్నారంతా. అయితే.. అసలు విషయం వేరే ఉందని పాంటింగ్ అన్నాడు. అందుకనే తాను ఢిల్లీని వీడాల్సి వచ్చిందిన అతడు వెల్లడించాడు.
‘ఢిల్లీ నన్ను పూర్తి స్థాయిలో హెడ్‌కోచ్‌గా ఉండాలని కోరింది. అందుకు నేను సిద్ధగా లేనని యాజమాన్యంతో చెప్పాను. అయితే.. చివరకు ఢిల్లీ నన్ను వదిలేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఫ్రాంచైజీ ఏం అనుకుంటుందో నాకు తెలిసిపోయింది. అందుకనే నేను ఢిల్లీ హెడ్‌కోచ్‌గా వైదొలిగాను’ అని పాంటింగ్ తెలిపాడు.
ఆస్ట్రేలియాకు మూడు వరల్డ్ కప్‌లు అందించిన పాంటింగ్.. ఐపీఎల్లో మాత్రం ఫెయిలయ్యాడు. ఏడు సీజన్లలో అతడి దిశా నిర్దేశనంలో ఢిల్లీ ఓసారి ఫైనల్ చేర్చినా కప్‌ను ఒడిసిపట్టుకోలేకపోయింది. దాంతో, ఇంకా అతడిని కొనసాగించి లాభం లేదనుకున్న ఫ్రాంచైజీ ఇక మీ సేవలు చాలని పాంటింగ్‌కు చెప్పేసింది.
ఐపీఎల్లో కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆసీస్ లెజెండ్‌ను పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఫ్రాంచైజీ కొత్త కోచ్‌గా నియమించింది. ఇక.. పాంటింగ్ పంజాబ్ ఐపీఎల్ ట్రోఫీ కలను నిజం చేసే పనిలో నిమగ్నం కానున్నాడు. కొత్త ఫ్రాంచైజీకి కోచ్‌గా వెళ్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నాడు పాంటింగ్.
‘నన్ను కొత్త హెడ్‌కోచ్‌గా తీసుకున్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు. ఈ కొత్త సవాల్‌ను స్వీకరించేందుకు నేను ఎంతో ఉత్సాహంతో ఉన్నా. పంజాబ్ జట్టు ప్రణాళికల గురించి యాజయాన్యంతో జరిపిన చర్చలు చాలా సంతృప్తినిచ్చాయి. ఫ్రాంచైజీపై నమ్మకం పెట్టుకున్న అభిమానుల నమ్మకాన్ని నిజం చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇకపై పంజాబ్ కింగ్స్ ఆటలో మార్పు చూస్తారని మేము మీకు ప్రామిస్ చేస్తున్నాం’ అని పాంటింగ్ తెలిపాడు.