train derailment attempt | రైలును పట్టాలు తప్పించేందుకు మరో యత్నం.. ట్రాక్‌పై తొలగించిన ఫిష్ ప్లేట్లు
train derailment attempt | రైళ్లను పట్టాలు తప్పించి ప్రమాదానికి గురి చేసే ప్రయత్నాలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ తరహా దుండగుల దుశ్చర్య బయటపడింది. రైలు పట్టాలను కలిపి ఉంచే ఫిష్ ప్లేట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. వాటిని రైలు పట్టాలపై ఉంచారు.
అహ్మదాబాద్: రైళ్లను పట్టాలు తప్పించి ప్రమాదానికి గురి చేసే ప్రయత్నాలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. (train derailment attempt) తాజాగా ఈ తరహా దుండగుల దుశ్చర్య బయటపడింది. రైలు పట్టాలను కలిపి ఉంచే ఫిష్ ప్లేట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. వాటిని రైలు పట్టాలపై ఉంచారు. అయితే రైల్వే సిబ్బంది దీనిని గుర్తించడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఫిష్ ప్లేట్లను తిరిగి బిగించిన తర్వాత రైళ్ల కదలికలను పునరుద్ధరించారు. గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కిమ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ ఫిష్‌ప్లేట్లు, లాక్, బోల్ట్లను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. వాటిని రైలు పట్టాలపై వరుసగా ఉంచారు.
కాగా, ఉత్తరప్రదేశ్ మార్గంలోని రైలు పట్టాలు తనిఖీ చేసే రైల్వే గ్రౌండ్ సిబ్బంది దీనిని గుర్తించినట్లు పశ్చిమ రైల్వేకు చెందిన వడోదర డివిజన్ అధికారి తెలిపారు. దీంతో రైళ్ల కదలికలను కొంతసేపు నిలిపివేసినట్లు చెప్పారు. రెండు పట్టాలను జాయింట్ చేసే ఫిష్‌ప్లేట్లను తిరిగి బిగించిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను విడుదల చేశారు.
#WATCH | Gujarat | Some unknown person opened the fish plate and some keys from the UP line track and put them on the same track near Kim railway station after which the train movement was stopped. Soon the train service started on the line: Western railway, Vadodara Division pic.twitter.com/PAf1rMAEDo
— ANI (@ANI) September 21, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

