Adam Gilchrist : ప్రపంచంలోని అత్తుత్యమ ఓపెనర్లలో ఆడం గిల్‌క్రిస్ట్(Adam Gilchrist ) పేరు ముందు వరుసలో ఉంటుంది. తన అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించడం అతడికి మహా సరదా. ఆస్ట్రేలియా తరఫున వికెట్ కీపర్, ఓపెనర్.. రెండు పాత్రల్ని అమోఘంగా పోషించిన గిల్లీ సుదీర్ఘ కెరీర్లో అత్యున్నత శిఖరాలకు చేరాడు. ఇప్పుడు కామెంటేటర్‌గా సైతం రాణిస్తున్న ఈ ఆసీస్ దిగ్గజం భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant)పై ప్రశంసలు కురిపించాడు. చెపాక్‌లో పంత్ సెంచరీతో గర్జించిన తీరును గిల్‌క్రిస్ట్ అద్భుతమని వర్ణించాడు.
అంతేకాదు అటాకింగ్ గేమ్ ఆడడంలో తనకంటే పంత్ రెండాకులు ఎక్కువే చదవాడని గిల్లీ కితాబిచ్చాడు. ‘అవును.. బౌలర్లను ఉతికారేయడంలో పంత్ నా కంటే కొంచెం ముందున్నాడు. నా మాదిరిగా కాకుండా అప్పుడప్పుడే ముందుకొచ్చి షాట్లు ఆడుతాడు. అలా పంత్ ఒత్తిడిని చిత్తు చేస్తాడు. నేను చాలా దూకుడుగా ఆడాను. కానీ, పంత్ మాత్రం ఇసుమంత భయం కూడా లేకుండా చెలరేగిపోతున్నాడు. అతడొక క్లాస్ ప్లేయర్’ అని గిల్‌క్రిస్ట్ వెల్లడించాడు.
Trademark sixes, excellent strokes, and a memorable return 👌👌
📽️ Recap Rishabh Pant’s 6th Test Hundred 💯#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) September 21, 2024
రెండేండ్ల క్రితం కారు యాక్సిడెంట్ నుంచి కోలుకున్న పంత్ ఏడాదిన్నర తర్వాత పునరాగనం చేశాడు. ఐపీఎల్లో హాఫ్ సెంచరీలతో ఫామ్ అందుకున్న అతడు.. టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024)లో చేసింది కొన్ని పరుగులే అయినా అటాకింగ్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లో ఆడిన ఈ డాషింగ్ బ్యాటర్ చెపాక్‌లో శతకంతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒంటిచేత్తో సిక్సర్లు బాదుతూ మునపటి పంత్‌ను తలపించాడు.
టాపార్డర్ విఫలమైనా నేనున్నాను బాస్ అంటూ శుభ్‌మన్ గిల్(119 నాటౌట్)తో కలిసి బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేశాడు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 109 పరుగుల వద్ద పంత్ ఔటైన కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా 287/4 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు.