Kamal Haasan | ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ (One nation – One election)పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ విధానంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జమిలి ఎన్నికలపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ ప్రతిపాదన ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ప్రతిపాదన ప్రమాదకరమైనది, లోపభూయిష్టమైనది. దాని మచ్చలు కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఉన్నాయి. అందువల్ల భారతదేశానికి ఇది అవసరం లేదు. భవిష్యత్తులో కూడా దీని అవసరం ఉండదు’ అని కమల్ పేర్కొన్నారు. ఏకకాలంలో ఎన్నిలు జరిగితే అది నియంతృత్వానికి, వాక్ స్వాతంత్య్రానికి, ఒకే నాయకుడి ఆధిపత్యానికి దారి తీసేదని కమల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
జమిలికి జై.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు
కాగా, ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌కు పచ్చజెండా ఊపింది. త్వరలో జరుగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్‌ను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నది.
తొలివిడతగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సిఫారసుల అమలును పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఇంప్లిమెంటేషన్ గ్రూప్‌ని సైతం ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే, ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా వనరులు ఆదా అవుతాయని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అభివృద్ధి, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించనున్నది. రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి ఎన్నికల సంఘం ఏకరూప ఓటరు, ఓటరు గుర్తింపు కార్డును సిద్ధం చేయాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను మాత్రమే నిర్వహిస్తుంది.
మున్సిపాలిటీలు, పంచాయతీలకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. అయితే, కమిటీ 18వ రాజ్యాంగ సవరణలను సిఫారు చేసిందని.. వీటిలో చాలా వరకు రాష్ట్రాల అసెంబ్లీల మద్దతు అవసరం లేదని పేర్కొంది. అయితే, వీటికి కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లులు అవసరం, వీటిని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఒకే ఓటరు జాబితా.. ఒకే ఓటరు.. ఒకే గుర్తింపు కార్డుకు సంబంధించి ప్రతిపాదిత మార్పుల్లో కొన్నింటికి కనీసం సగం రాష్ట్రాల నుంచి మద్దతు అవసరం. దీంతో పాటు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై లా కమిషన్ తన నివేదికను కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నది. సమాచారం ప్రకారం.. లా కమిషన్ 2029 నుంచి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలు, పంచాయతీ వంటి స్థానిక సంస్థలను ఏకకాలంలో నిర్వహించాలని సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
Also Read..
Kangana Ranaut | అందుకోసం దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరు.. రాహుల్‌పై కంగన తీవ్ర వ్యాఖ్యలు
Rahul Gandhi | తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?