తిరుమల : తిరుమల(Tirumala శ్రీవారి మహాప్రసాదం లడ్డూ(Laddu) లో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi ) స్పందించారు. శ్రీవేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయని ఎక్స్‌వేదిక ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.
లార్డ్ బాలాజీ భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులకు ఆరాధ్యమైన దేవుడని అన్నారు. ఘటన జరుగడం ప్రతి భక్తుడిని కలవరపాటుకు గురి చేస్తుందని, ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.