Kangana Ranaut | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై బాలీవుడ్ నటి, మండి లోక్‌సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించారు.
భారత్‌లో కొన్ని మతాలు, భాషలు మిగిలిన వాటికంటే తక్కువనే భావన ఆరెస్సెస్‌లో ఉందని అమెరికా పర్యటనలో రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కంగన తాజాగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మన దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా ఆయన వెనుకాడరని అన్నారు.
‘రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు మన దేశం గురించి ఎలాంటి విషయాలు మాట్లాడతారో.. అది ప్రజలందరికీ తెలుసు. దేశంపై ఆయనకు ఉన్న భావన కూడా తెలుసు. అధికారంలోకి రావడానికి దేశాన్ని విభజించడానికి కూడా ఆయన వెనుకాడరు (divide the country to get into power)’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కంగన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
కాగా, ఈ నెల ఆరంభంలో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్, ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదే సమయంలో వాషింగ్టన్ డీసీలోని వర్జీనియా సబర్బ్ హెర్న్‌డాన్‌లో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో మత స్వేచ్ఛ గురించి ఆయన మాట్లాడారు. ‘భారతదేశంలో ఒక సిక్కు తలపాగా ధరించడానికి లేదా కడా ధరించడానికి అనుమతిస్తారా? సిక్కుగా గురుద్వారాకు వెళ్లగలరా? అన్న దానిపై పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటం ఒక్క సిక్కుల కోసమే కాదు అన్ని మతాల కోసం’ అని అన్నారు.
Also Read..
Devara Release Trailer | ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మరో ట్రైలర్.?