Devara Movie | నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దేవర. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా నుంచి మరో ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 22న మేకర్స్ భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలోనే చిత్రబృందం రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇండియన్ టాప్ దర్శకులు రాజమౌళితో పాటు త్రివిక్రమ్, సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
#Devara – Release Trailer – Tomorrow pic.twitter.com/ERpwmknvgq
— Aakashavaani (@TheAakashavaani) September 21, 2024
Also Read..