Jani Master | టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master) డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన వివాదం సినీ ఇండస్ట్రీలో చర్చయానీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వివాదంలో జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసులు నమోదు కాగా.. దీనిపై విచారణ జరిపిన ఉప్పరపల్లి కోర్టు (Upparpally court) 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది. దీంతో జానీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఈ ఈ వ్యవహరంలో జానీ మాస్టర్‌తో పాటు అతడి భార్య అయేషా అలియాస్ సుమలత చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తుంది. సుమలత మీదా కూడా పోలీసులు కేసు నమోదు చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది.
తన భర్తపై ఆరోపణలు చేసినందుకు లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లిన జానీ భార్య సుమలత ఆమెపై దాడిచేసినట్లు సమాచారం. జానీ మాస్టర్‌తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్ళిన సుమలత ఆమెపై దాడి చేసి వేధించినట్లు ఈ విషయం బయటకు చెబితే నీ కెరీర్ నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు అత్యాచార బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ కేసులో జానీతో పాటు అతడి భార్యను అలాగే మరో ఇద్దరిని నిందితులుగా చేర్చాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read..