చెన్నై: బంగ్లాదేశ్‌తో (Ind Vs Ban) జరుగుతున్న తొలి టెస్టులో.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఇవాళ భోజన విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 205 రన్స్ చేసింది. గిల్ 86, పంత్ 82 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆ ఇద్దరూ 138 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. దీంతో భారత్ 432 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. గిల్, పంత్‌లు ఇవాళ ఉదయం నుంచి తమ ఫ్రీ స్టయిల్ గేమ్‌ను ఆడారు. బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. శుభమన్ గిల్ టెస్టుల్లో ఏడవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రెండేళ్ల తర్వాత ఫస్ట్ టెస్టు ఆడుతున్న పంత్ కూడా తన వెరైటీ షాట్లతో అలరించాడు. 88 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ చేశాడు. ఫిఫ్టీ కొట్టిన తర్వాత పంత్ తన పవర్ గేమ్ ప్రదర్శించాడు. 72 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద పంత్ క్యాచ్‌ను షాంతో డ్రాప్ చేశాడు.
Lunch on Day 3 of the 1st Test.#TeamIndia 205/3
Shubman Gill and Rishabh Pant amass 124 runs in the morning session.
Scorecard – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/4qRa6Cvc1i
— BCCI (@BCCI) September 21, 2024