చెన్నై: రిషబ్ పంత్(Rishabh Pant) తన ప్రతిభను చాటాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో.. సెంచరీ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 109 రన్స్ చేసి నిష్క్రమించాడు. 124 బంతుల్లో ఆ సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో అతనికి ఇది ఆరవ సెంచరీ కావడం విశేషం. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన రిషబ్ పంత్.. రెండేళ్ల క్రితం ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. ఉత్తరాఖండ్‌లో అతని కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాదాపు ప్రాణాలు పోగొట్టుకునే స్థితి నుంచి అతను కోలుకున్న తీరు నమ్మలేనిది.
నిజానికి టెస్ట్ ఫార్మాట్.. రిషబ్‌కు చాలా ఇష్టమైంది. కానీ యాక్సిడెంట్ వల్ల అతను దాదాపు 700 రోజుల పాటు ఆ ఫార్మాట్‌కు దూరం అయ్యాడు. కారు ప్రమాదం నుంచి రిషబ్ కోలుకోవడమే కాదు, ఇప్పుడు సెంచరీ చేసి తన సత్తాను ప్రదర్శించాడు. 128 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 109 రన్స్ చేసి ఔటయ్యాడు.
టెస్టుల్లో చాలా వేగంగా స్కోర్ చేసే సామర్థ్యం కలిగిన పంత్.. ఓ పెద్ద రికార్డును బ్రేక్ చేశాడు. భారత వికెట్ల కీపర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ధోనీ రికార్డును ప్రస్తుతం సమం చేశాడు. 58 ఇన్నింగ్స్‌లో రిషబ్ ఆరవ సెంచరీ నమోదు చేశాడు. కానీ ధోనీ మాత్రం 144 ఇన్నింగ్స్‌లో ఆరు సెంచరీలు చేశాడు. వృద్ధిమాన్ సాహా 54 ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు.
A CENTURY on his return to Test cricket.
What a knock this by @RishabhPant17 👏👏
Brings up his 6th Test ton!
Live – https://t.co/jV4wK7BgV2…… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/A7NhWAjY3Z
— BCCI (@BCCI) September 21, 2024
బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో తాజా సమాచారం ప్రకారం ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 258 రన్స్ చేసింది. శుభమన్ గిల్ కూడా సెంచరీతో కదం తొక్కాడు.